Bhatti Vikramarka : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీబీనగర్ ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఆయన, మార్గమధ్యంలో ఈ పాఠశాల వద్ద ఆగి విద్యార్థుల సమస్యలు, సౌకర్యాలపై సమీక్ష చేశారు. ఈ సందర్బంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ తో కలిసి విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన మెనూ, కాస్మోటిక్ ఛార్జీల నిధుల వినియోగం,…