బండి సంజయ్ కు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. మూసపేటలో చెరువుల కబ్జా చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఆరోపణల పై ఎమ్మెల్యే స్పందించారు. నేను చెరువుల కబ్జాకు పాల్పడినట్లు నిరూపణ అయితే రాజీనామాకు సిద్దమన్నారు. కబ్జాలలో బీజేపీ నాయకుల హస్తం ఉంటే బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా? అని సవాల్ విసిరారు. చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. Read…