టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. గతంలో యువగళం పేరుతో తాడిపత్రికి వచ్చి తనపై నిరాధారమైన ఆరోపణలు చేశాడు లోకేష్.. మరలా లోకేష్ శంఖారావం పేరుతో తాడిపత్రికి వస్తున్నాడు అని ఆయన తెలిపారు.
అనంతపురం జిల్లా ధర్మవరం లోని కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు టీడీపీ ధర్మవరం ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరాం, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు బీకే పార్థసారథి. ధర్మవరం నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ ను రాత్రికి రాత్రే కూల్చివేసిన మునిసిపల్ అధికారుల తీరుపై శ్రీరాం మండిపడ్డారు. మార్కెట్ సమస్యలు మార్కెట్ లో కాకుండా ఎమ్మెల్యే ఇంట్లో పరిష్కారిస్తున్నాడా..?అధికారులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బంట్రోతుల్లా మార్కెట్ మీదకు వదిలాడు. అధికారులు ఎమ్మెల్యే కంట్రోల్ లో పని చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.…