ఆ ఎమ్మెల్యే చెప్పేవన్నీ కబుర్లు తప్ప... చేతల్లో కనిపించడం లేదా? మాటలు కోటలు దాటుతున్నాయి గానీ... అభివృద్ధి పనులు గడప కూడా దాటడం లేదా? పైగా అనుచరులు దందాల్లో ఆరితేరిపోయి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా? ఎమ్మెల్యేకి స్ననిహితుడైన డాక్టర్ వైద్యం మానేసి సెటిల్‌మెంట్స్‌లో బిజీగా ఉన్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ జరుగుతోందా తంతు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేసేలా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దురుద్దేశంతో, కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్.. రాష్ట్ర ప్రజలను భయపెట్టేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో వివాదాస్పద వ్యక్తిగా మారుతున్న టాక్ పెరుగుతోంది లోకల్‌గా. ప్రత్యేకించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికే మద్యం సిండికేట్, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తాజాగా భూ దందాలపై అలిగేషన్స్ రావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సమీపంలో ఉన్న గౌతమి సూపర్ బజార్‌కు సంబంధించిన 300 గజాలు స్థలం లీజు వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు ఐదు…