MK Stalin: తమిళనాడులో 27 ఏళ్ల అజిత్ కుమార్ పోలీస్ కస్టడీలో మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును విచారిస్తూ హైకోర్టు ప్రభుత్వంపై విరుచుకుపడింది. ‘‘హంతకుడు కూడా ఇంత ఘోరంగా దాడి చేయడు. పోలీసులు అధికార మత్తులో ఉన్నారు. రాష్ట్రమే తన సొంత పౌరుడిని చంపింది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు పొలిటికల్ వివాదంగా మారింది. ప్రతిపక్షాలు అధికార డీఎంకే, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు. స్టాలిన్ రాజీనామా…
ఎలక్షన్స్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ, ఏఐఏడీఎంకేలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అన్నారు. ఇక, ముఖ్యమంత్రి అభ్యర్థి ఏఐఏడీఎంకే నుంచి ఉంటారని స్పష్టం చేశారు. కాగా, పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) పేరును అమిత్ షా ప్రస్తావించలేదు.
Anna University Case: తమిళనాడులో సంచలనం సృష్టించిన 19 ఏళ్ల అన్నా యూనివర్సిటీ విద్యార్థిని అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. స్థానికంగా బిర్యానీ విక్రేత అయిన నిందితుడు జ్ఞానశేఖరన్‌కు జీవిత ఖైదు విధించబడింది. విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడినందుకు చెన్నైలోని మహిళా కోర్టు నిందితుడికి శిక్షను ఖరారు చేసింది. జీవిత ఖైదుతో పాటు రూ. 90,000 జరిమానా విధించింది.
ఢిల్లీలోని భారత్ మండపంలో ఈరోజు నీతి ఆయోగ్ కి సంబంధించి కీలక సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జరిగిన ఈ సమావేశంలో 2047 వరకు అభివృద్ధి చెందిన భారతదేశ ప్రణాళికలపై చర్చించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ప్రధాని మోడీ వారితో టీ తాగుతూ చర్చిస్తున్న ఫొటోలు కనిపించింది.
DMK: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన నాయకుడి భార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారం ఇప్పుడు అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే మధ్య విమర్శలకు దారి తీసింది. తమిళనాడుకు చెందిన ఒక యువతి, తన భర్త తనపై హింస, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. నిందితుడైన 40 ఏళ్ల వ్యక్తికి అధికార డీఎంకేతో సంబంధాలు ఉన్నాయి. ‘‘అతని పని 20 ఏళ్ల అమ్మాయిలను రాజకీయ నాయకుల వద్ద పడుకోబెట్టడం, అతను నన్ను పిచ్చి…
CM M K Stalin: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడి తమిళనాడు రాష్ట్రంలో జరగదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. ఇక, మతతత్వం ఎన్నటికీ తమిళనాడును ఆక్రమించదని తేల్చి చెప్పారు.
MRK Panneerselvam: తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ పై డీఎంకే మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం విమర్శలు గుప్పించారు. గతంలో విజయ్ బ్లాక్ టిక్కెట్లు అమ్మిన వ్యక్తి ఇప్పుడు అవినీతి గురించి ప్రసంగాలు ఇస్తున్నాడు అని మండిపడ్డారు.
NEET, NEPలతో తమిళ విద్య వ్యవస్థను దెబ్బ తీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వీటి ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దుతోంది.. ఇది హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషపై పోరాటం మాత్రమే కాదు.. తమిళ సంస్కృతిని రక్షించడానికి ఒక జాతి పోరాటం.
గవర్నర్ రవి మరో పంచాయతీకి తెర లేపాడు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఊటీలో విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్లు, రిజిస్ట్రార్ల కోసం రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తమిళనాడుకు చెందిన కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తీవ్రంగా విమర్శించాయి.
MK Stalin: తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తను శుక్రవారం అమిత్ షా ప్రకటించారు. రెండు పార్టీలు కలిసి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ పొత్తుపై అధికార డీఎంకే పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ పొత్తుని ‘‘ఓటమి అవినీతి కూటమి’’గా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. అధికారం కోసమే ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయని ఆరోపించాడు.