మిజోరం (Mizoram) అసెంబ్లీ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. తొలిసారి ఒక మహిళ, అది కూడా పిన్న వయస్కురాలైన వన్నెహసాంగి (Baryl Vanneihsangi) శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
Amit Shah: భారతదేశంలోకి మయన్మార్ నుంచి స్వేచ్ఛగా ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు మయన్మార్ సరిహద్దుల్లో కంచెను నిర్మిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. మయన్మార్‌లో జాతుల సంఘర్షణ నుంచి తప్పించుకునేందుకు అక్కడి సైనికులు భారత్ లోని మిజోరాం, మణిపూర్ రాష్ట్రాలకు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మయన్మార్‌తో భారత్ సరిహద్దుల్ని బంగ్లాదేశ్‌తో సమానంగా రక్షించాలని అస్సాం పోలీస్ కమాండో పాసింగ్ పరేడ్‌లో అమిత్ షా అన్నారు.
Mizoram : మిజోరంలో తొలిసారిగా ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరి పేరు బారిల్ వేణిసంగి. బెరిల్ మిజోరాంలో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యే. ఐజ్వాల్ సౌత్-III స్థానం నుంచి జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM)కి చెందిన బెరిల్ విజయం సాధించారు.
లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) మిజోరంలో విజయం సాధించింది. 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో అధికార MNF (మిజో నేషనల్ ఫ్రంట్)ను అధికారం నుండి తొలగించి.. జడ్పీఎం అధికారం చేపట్టనుంది. కాగా.. మిజోరాం నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లాల్దుహోమ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) ఘనవిజయం సాధించింది. ఈసారి అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అందరు భావించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 40 సీట్లున్న అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) 27 సీట్లను గెలుచుకుంది.
తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయిదు రాష్ట్రాల్లో ఒక్కొ తేదీన ఒక్కొ రాష్ట్రానికి ఎన్నికలు జరగగా.. ఓట్ల లెక్కింపు తేదీని మాత్రం డిసెంబర్ 3న నిర్ణయించింది సెంట్రల్ ఎన్నికల కమిషన్. ఈ మేరకు అంత సిద్ధం అవుతుండగా ఈశాన్య రాష్ట్రం మిజోరం తేదీని మాత్రం సవరిస్తూ తాజాగా ఎలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. మిజోరం రాష్ట్రం ఓట్ల లెక్కింపు తేదీలో మార్పు చేసినట్టు ఈ…