Mizoram: జయహో నారీమణి.. చిన్న వయసులో స్పీకర్‌గా ఎన్నిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిజోరం (Mizoram) అసెంబ్లీ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. తొలిసారి ఒక మహిళ, అది కూడా పిన్న వయస్కురాలైన వన్నెహసాంగి (Baryl Vanneihsangi) శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె స్పీకర్ చైర్‌లో ఆసీనులయ్యారు. దీంతో మిజోరం హిస్టరీలో ఆమె ఒక చరిత్ర సృష్టించింది.
మిజోరాం రాష్ట్ర అసెంబ్లీలో 40 మంది సభ్యులున్నారు. మొట్టమొదటి సారిగా ఓ మహిళ స్పీకర్‌గా నియమితులయ్యారు. జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ నాయకురాలు, ఎమ్మెల్యే బారిల్ వన్నెహసాంగి మార్చి 7న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ స్థానాన్ని అధిష్టించారు.
Also Read
మిజోరాం అసెంబ్లీకి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక మైలురాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి, జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అగ్రనేత లాల్దుహోమా చెప్పుకొచ్చారు. సాంప్రదాయ పరిమితులను దాటుకుని రాజకీయాల్లోకి వస్తున్న మహిళలకు ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళలు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వీరిలో జోరెమ్ పీపుల్స్ మూవ్‌మెంట్‌కి చెందిన వన్నెహసంగి ఒకరు. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఎఫ్. లాల్నున్మావియాపై ఆమె 9,370 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా కూడా 32 ఏళ్ల వన్నెహసాంగి చరిత్ర సృష్టించారు.
ప్రస్థానమిది..
రాజకీయ రంగంలోకి అడుగు పెట్టకముందు వన్నెహసాంగి ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా పనిచేశారు. ఇక మేఘాలయలోని షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అనంతరం ఆమె ఓ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేశారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!