భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన షమీ.. ఈ సందర్భంగానే 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో.. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ని అందుకున్న మూడో బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. మొత్తం 80 మ్యాచ్‌ల్లో షమీ ఆ ఫీట్‌ని అందుకున్నాడు. అటు ఆఫ్గన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా అవే గణాంకాల్ని నమోదు చేయడంతో.. ఇద్దరూ సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నారు.…