Ajay Arasada: వైజాగ్‌లో పుట్టి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారని, అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని.. అలా మ్యూజిక్ పై ఆసక్తి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా సంగీతాన్ని అందించిన…
షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరిస్ లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష నర్రా హీరోగా పరిచయమైన సినిమా ‘మిస్సింగ్’. ఇదే సినిమాతో శ్రీని జోస్యుల సైతం దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా నిర్మించిన ‘మిస్సింగ్’ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది. సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే గౌతమ్ (హర్ష నర్రా), శ్రుతి (నికీషా రంగ్వాలా)ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తొలుత శ్రుతి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పెళ్ళికి…
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మిస్సింగ్’. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 29న విడుదల కానుంది. గురువారం ప్రమోషనల్ సాంగ్ ‘ఖుల్లమ్ ఖుల్లా’ను దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. ఈ సినిమాలో మిస్ అయ్యేది హర్షవర్థన్. తన కోసం హీరో సహా మిగతా…