హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మిస్సింగ్’. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం 29న విడుదల కానుంది. గురువారం ప్రమోషనల్ సాంగ్ ‘ఖుల్లమ్ ఖుల్లా’ను దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడాడు. ఈ సినిమాలో మిస్ అయ్యేది హర్షవర్థన్. తన కోసం హీరో సహా మిగతా వాళ్లంతా వెదుకుతుంటారు. మరి అతను దొరికాడా? లేడా? అన్నదే కథ. థ్రిల్లింగ్, రొమాన్స్, సస్పెన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించామంటున్నాడు దర్శకుడు శ్రీని. మరి మిస్సింగ్ ను ఆడియన్స్ మిస్ చేయకుండా చూస్తారో? లేదో?
Read Also : ‘లైగర్” హీరోయిన్ ఇంటిపై ఎన్సీబీ దాడులు