Ajay Arasada: వైజాగ్‌లో పుట్టి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. తన ఇంట్లో అత్త, అక్కలు వీణ వాయిస్తూ ఉండేవారని, అది చిన్నప్పటి నుంచి గమనించేవాడిని.. అలా మ్యూజిక్ పై ఆసక్తి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చాడు. ఆయన తాజాగా సంగీతాన్ని అందించిన పీరియాడిక్ వెబ్ సిరీస్ ‘వికటకవి’ నవంబర్ 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడతో స్పెషల్ చిట్ చాట్ సంభాషణ ఈ విధంగా…
* అజయ్ అరసాడ నేపథ్యం..
వైజాగ్‌లో పుట్టి పెరిగి, గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసారు. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా 2011 నుంచి 2018వరకు జాబ్ చేసిన తర్వాత, ఉద్యోగం మానేసి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనకు ఫ్యామిలీ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చింది.
* మ్యూజిక్ అంటే ఎందుకు ఆసక్తి ?
వారి ఇంట్లో అత్తలు, అక్క వీణ వాయిస్తూ ఉండేవారుని, అది చిన్నప్పటి నుంచి గమనించడంతో.. అలా ఆసక్తి పెరుగుతూ వచ్చిందని తెలిపారు. అలా నిశితంగా గమనించటంతోనే సంగీతాన్ని నేర్చుకుంటూ వచ్చానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు గిటార్ నేర్చుకోవాలనుకున్నాని, అందుకని శరత్ మాస్టర్ దగ్గర రెండున్నర నెలల పాటు బేసిక్స్ నేర్చుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నాకు నేనుగా సొంతంగా ప్లే చేస్తూ నేర్చుకోవటం స్టార్ట్ చేశానని తెలిపారు. గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత కాస్త ఎక్కువ సమయం దొరకడంతో.. కొన్ని సందర్భాల్లో అయితే కాలేజీలకు బంకులు కొట్టేసేవాడినని, అక్కడ మ్యూజిక్ బ్యాండ్స్‌తో కలిసి తిరగటం వల్ల మ్యూజిక్‌పై కాస్త పట్టు పెరిగిందని తెలిపారు.
* సినీ రంగంలోకి ఎలా ఎంట్రీ?
2011 నుంచి 2018 వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూనే.. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌కు వర్క్ చేసేవాడిని తెలిపారు. ఇలా చేయటం వల్ల నాకు మంచి ప్రాక్టీస్ దొరికినట్లయ్యిందని, ఈ క్రమంలో ప్రదీప్ అద్వైత్ నన్ను జగన్నాటకం డైరెక్టర్ ప్రదీప్‌కు పరిచయం చేశారని తెలిపారు. నేను అంతకు ముందు చేసిన ఓ 30 సెకన్ల మ్యూజిక్ బిట్ విని నాకు జగన్నాటకం మూవీలో చాన్స్ ఇచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలోకి నా తొలి అడుగు పడింది. తర్వాత ఇండిపెండెంట్‌గా వర్క్ చేసుకుంటూ వస్తుండేవాడిని. ఆ సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల నన్ను గూఢచారి సినిమాలో కీ బోర్డ్ ప్రోగ్రామింగ్ కోసం వర్క్ చేయమని అడగటంతో వర్క్ చేశాను. ఆ తర్వాత క్షీర సాగర మథనం, నేడే విడుదల, మిస్సింగ్, శ్రీరంగనీతులు సినిమాలకు వర్క్ చేశాను. సినిమాలతో వెబ్ సిరీస్‌లైణ సేవ్ ది టైగర్స్ సీజన్1, సీజన్2లకు సంగీతాన్ని అందించాను. రీసెంట్‌గా వికటకవి సిరీస్‌కు వర్క్ చేశానని తెలిపారు.
* ఆయ్ సినిమాలో అవకాశం..
సంగీతాన్నందించిన ‘మిస్సింగ్’ మూవీలో ఓ బీజీఎం బిట్ విన్న నిర్మాత బన్నీవాస్ కి అది బాగా నచ్చింది. ఆయన ఆ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్‌కు వచ్చినప్పుడు ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, తప్పకుండా కలిసి పని చేద్దామని బన్నీవాస్ చెప్పారన్నారు. అన్నట్లుగానే ఆయ్ సినిమాకు వర్క్ చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే ముందగా అమ్మలాలో రామ్ భజన సాంగ్‌తో పాటు ఓ ఐటెమ్ సాంగ్‌కు సంగీతాన్ని ఇవ్వమని బన్నీవాస్ చెప్పారన్నారు. నేను కూడా ఆ రెండు పాటలు కంపోజ్ చేసిచ్చానని, అవి వారికి అవి బాగా నచ్చేశాయని తెలిపారు. దాంతో మిగిలిన పాటలతో పాటు బీజీఎం వర్క్ కూడా చేయమని అన్నారు. అలా ఆయ్ సినిమాకు వర్క్ చేశానని తెలిపారు.
* పీరియాడిక్ సిరీస్ వికటకవి వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్..
దర్శకుడు ప్రదీప్ మద్దాలికి ఏం కావాలనే దానిపై పక్కా క్లారిటీ ఉందని, అందువల్ల నేను వికటకవి సిరీస్‌కు వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా కష్టపడలేదని ఆయన అన్నారు. డైరెక్టర్సే నాకు గురువులు. అందువల్ల డైరెక్టర్ ప్రదీప్ మద్దాలికి కావాల్సిన ఔట్‌పుట్ ఇస్తూ వెళ్లానంతే అని తెలిపారు. ఆయ్ సినిమాకు వర్క్ చేసేటప్పుడే వికటకవి సిరీస్‌లో మూడు ఎపిసోడ్స్‌కు మ్యూజిక్ చేశాను. ఆయ్ రిలీజ్ తర్వాత మరో మూడు ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేశాను. వికటకవికి వర్క్ చేయటం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. నేను డైరెక్టర్స్ టెక్నిషియన్.. వాళ్లకి కావాల్సిన ఔట్‌పుట్ ఇవ్వటమే నా ప్రయారిటీ.. అది ఏ జోనర్ సినిమా అయినా, సిరీస్ అయినా మ్యూజిక్ చేయటానికి సిద్ధమే అని అన్నారు.
* మీకు ఇన్‌స్పైరింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
” దేవిశ్రీ ప్రసాద్” అంటే నాకు చాలా ఇష్టం.
* నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతం త్రీరోజెస్ సీజన్ 2తో పాటు ఆహాలో మరో రెండు వెబ్ సిరీస్‌లకు వర్క్ చేస్తున్నాను. కొన్ని సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వాటి వివరాలను తెలియజేస్తానని అన్నారు.