KTR : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తాజాగా వివాదంలో చిక్కుకున్నాయి. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన ఆరోపణలు ఈ పోటీల చుట్టూ కలకలం రేపుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మిల్లా, నిర్వాహకులు తమపై అసభ్యమైన ఒత్తిడులు తీసుకువచ్చారని, స్పాన్సర్లను ఆకట్టుకోవాలనే ముట్టడి ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఇది వేశ్యలాగానే ప్రవర్తించినట్లుగా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆమె పోటీని మధ్యలోనే వదిలేసి స్వదేశానికి తిరిగిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తన సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, మిల్లా మాగీ ఎదుర్కొన్న అనుభవాలపై తాను చింతిస్తున్నానని తెలిపారు.
‘Lenin’ : అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ !
తెలంగాణ రాష్ట్రం మహిళలకు గౌరవం కల్పించే ప్రాచీన సంస్కృతి కలిగిన ప్రాంతమని, రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి వీర మహిళలు ఇక్కడి నుంచే వెలిసిన విషయాన్ని గుర్తు చేశారు. మిల్లా వేదనకు గౌరవం తెలుపుతూ, ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడాన్ని అభినందించిన కేటీఆర్, ఈ సంఘటన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించదని అన్నారు. బాధితురాలిని తప్పుపట్టే ధోరణిని ఖండించిన ఆయన, బాధితురాలికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, మిస్ వరల్డ్ నిర్వాహకులు, సంబంధిత సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. “ఒక కూతురి తండ్రిగా నేను కోరుకునేది – ఏ మహిళా లేదా బాలిక ఇలాంటి పరిస్థితులను ఎప్పటికీ ఎదుర్కొనకూడదు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.