తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. వాటి పేర్లు 'ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన', 'రేవంతన్నకా సహారా మిస్కీన్ కేలియే'. రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ పథకాలను ప్రారంభించారు.
Karnataka: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లను పెంచే ప్రతిపాదనను కర్ణాటక క్యాబినెట్ ఈ రోజు ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే అన్ని హౌసింగ్ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటాను మంజూరు చేసింది. మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్లను ప్రస్తుత 10 శాతం నుండి 15 శాతానికి పెంచే ప్రతిపాదనకు గృహనిర్మాణ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ మద్దతు ఇచ్చారు.
CS Ramakrishna Rao: నేడు (మే 13) సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాలలో మెరుగైన సేవలు అందించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు సీఎస్ రామకృష్ణారావు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్ధుల బ్యాంక్ అకౌంట్…
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం, 2025 అమల్లోకి వచ్చింది. ఈ మేరకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 8 నుంచే ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంట్ ఉభయ సభల నుంచి ఈ బిల్లు పాస్ అవ్వగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ (సవరణ) బిల్లు చట్టంగా మారింది. ఈ నేపథ్యంలో నేటి నుంచే అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేంద్రం గెజిట్…
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
వైసీపీ మంత్రులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే గోపినాథ్ రెడ్డి, నేతలు, పార్టీ శ్రేణులు. బస్సు యాత్ర సందర్భంగా కిక్కిరిసింది నర్సరావుపేట. రాష్ట్రంలో సామాజిక న్యాయభేరీ యాత్ర చేసే హక్కు మాకే వుందన్నారు వైసీపీ మంత్రులు. నేల ఈనిందా? మహానాడు వేదిక పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ కూడా లేదు. అచ్చెన్నాయుడుకు సిగ్గు లేదా? బీసీలకు చంద్రబాబు…