ఏపీలో ముస్లిం మైనారిటీలకు రాజకీయంగా పెద్ద పీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. ముస్లిం మత పెద్దలతో ముఖ్యమంత్రి జగన్ మూడు గంటల పాటు సమావేశం అయ్యారన్నారు. ముఖ్యమంత్రి ఇంత సమయం కేటాయించటం సాధారణ విషయం కాదు. చట్ట సభల్లో ముస్లిం మైనారిటీలకు రాజకీయ పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే.. చంద్రబాబు ఎప్పుడూ మైనారిటీకు ప్రాధాన్యత ఇవ్వలేదు.. అన్ని రంగాల్లో వారికి మా గురువులు కొన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. అన్ని అంశాలను ముఖ్యమంత్రి జగన్ నిశితంగా విన్నారు.
Read Also: kousalya : కొడుకు కోసం కష్టాలు పడ్డా.. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోమంటున్నాడు
ఈ సమస్యల పరిష్కారానికి వెంటనే సీఎంఓ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు చేశారు. మా మైనారిటీ వర్గాల తరపున ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపారన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. వైసీపీ మైనారిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా మాట్లాడుతూ.. చంద్రబాబు మైనారిటీలకు సంబంధించి 16, 17 హామీలు ఇచ్చి ఒకటి కూడా పూర్తి చేయలేదు. జగన్ మాకు ఇచ్చిన హామీల్లో 98 శాతం పూర్తి చేశారు . 2,100 కోట్లు ఖర్చు చేస్తే జగన్ మూడున్నర ఏళ్ళల్లో 21 వేల కోట్లు ఖర్చు చేశారు. జమాతే అల్ హదీస్, విజయవాడ ప్రెసిడెంట్ నసీరుద్దీన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తో మీటింగ్ అంటే ఏదో అప్లికేషన్ తీసుకుని పరిష్కరిస్తారు అనుకున్నాం. కానీ చాలా డైనమిక్ గా అప్పటికప్పుడే సమస్యల పరిష్కరానికి ఆదేశాలు జారీ చేయటం అభినందనీయం. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో చాలా స్పష్టంగా మా కళ్ళకు కనిపించింది.
Read Also: Talasani srinivas yadav: ఇదంతా రాజమౌళి వల్లే.. త్వరలో RRR టీమ్‌ను..