మైనారిటీల గుర్తింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు… రాష్ట్ర స్థాయిలో హిందువులు సహా మైనారిటీలను గుర్తించే అంశంపై కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంభించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది మరియు మూడు నెలల్లో ఈ అంశంపై రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని ఆదేశాలు జారీ చేసింది.. దేశంలో హిందువులు 10 రాష్ట్రాల్లో మైనార్టీలుగా ఉన్నారని, రాష్ట్ర స్థాయిలో మైనార్టీల గుర్తింపు కోసం మార్గదర్శకాలు రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది…