CRPF Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. 9,212 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(CRPF)లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు మార్చి 27నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సీఆర్‌పీఎఫ్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఈ పోస్టులకు పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
Also Read:AP Budget 2023-24: అసెంబ్లీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి బుగ్గన.. కేటాయింపులు ఇలా..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఒకటి. ఇది భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తారు. వ్రాత పరీక్ష, PET & PST, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. CRPF కానిస్టేబుల్ 9212 కానిస్టేబుల్ ఖాళీల కోసం టెక్నికల్ మరియు ట్రేడ్స్‌మన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. CRPF రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారిక వెబ్‌సైట్ www.crpf.nic.inలో చూడొచ్చు.
Also Read:CM Jagan: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం… ప్రధానితో భేటీ కానున్న జగన్..
Also Read
మొత్తం 9212 పోస్టులు ఉండగా.. ఇందులో ఏపీలో 428 పోస్టులు, తెలంగాణలో 307 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ,ఎస్టీ,మహిళా అభ్యర్థులకు ఎలాంటి పరీక్ష రుసుం లేదు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. జూన్ 20 నుంచి 25 వరకు సీబీటీ పరీక్షకు అడ్మిట్‌కార్డులు విడుదల చేస్తారు. కంప్యూటర్ బేస్డ్‌టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్‌టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT) జులై 1 నుంచి 13 వరకు నిర్వహిస్తారు.
ఈ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఇంగ్లిష్/ హిందీలో ఉంటుంది. ఉద్యోగంలో భర్తీ అనంతరం వేతన స్కేలు: రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. కాగా, కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు 21 నుంచి 27 ఏళ్లు వయో పరిమితి విధించారు. ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు ఇవ్వగా.. ఓబీసీలు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు సడలింపు ఇచ్చారు.
తాజావార్తలు
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!