Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమె ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ వైపు భారత ప్రభుత్వం, మరోవైపు కుటుంబసభ్యులు నిమిషప్రియను కాపాడేందుకు నిరంతరం శ్రమించారు. మరోవైపు కేరళకు చెందిన ఓ ముస్లిం మతపెద్ద జోక్యంతోనే నిమిష ప్రియ ఉరిశిక్ష వాయిదా పడిందని సమాచారం. అయితే తానే నిమిష ప్రియను కాపాడానని కె.ఎ.పాల్ ప్రకటించుకున్నారు. మరి నిమిష ప్రియను కాపాడిందెవరు..? చివరి నిమిషంలో…
యెమెన్ జాతీయుడి హత్య కేసులో ఉరిశిక్ష పడిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు వచ్చే వారం జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. గత సంవత్సరం, కేరళకు చెందిన నిమిషా ప్రియకు యెమెన్ అధ్యక్షుడు మరణశిక్షను ఆమోదించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఆమె కుటుంబ సభ్యులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. సాధ్యమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉరిశిక్ష పడిన…