మంత్రి మల్లారెడ్డి అలాగే.. ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ భూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. ఇప్పటికే పలు సందర్భాల్లో మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు రాగా.. తాజాగా మరోసారి మంత్రి మల్లారెడ్డికి చిక్కుల్లో పడినట్టు అయ్యింది.. ఎందుకంటే.. మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త అయిన ముద్దుల శ్రీనివాసరెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నాడు. భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మార్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ భర్త మద్దుల శ్రీనివా్‌సరెడ్డితో పాటు 15 మందిపై…
వ్యవసాయం ఆగిపోతే ప్రపంచం అంతరిస్తుందని…వ్యవసాయం బాగుండాలి… అన్నదాతను గౌరవించాలని… ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు అని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల వానాకాలం పంటల అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. 11 వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువులు, కుంటలు, ప్రముఖ ఆలయాలను కాకతీయ రాజులు నిర్మించారని…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత వెంకన్న 100 మందితో సూసైడ్ బ్యాచ్ రెడీగా వుందన్న వ్యాఖ్యలపై మంత్రి జోగిరమేష్ స్పందించారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటం చంద్రబాబు రక్తంలోనే వుంది. టీడీపీ మాపై పోటీ పడి గెలిచే అవకాశమే లేదు. మేం వాళ్ళని టచ్ చెయ్యనవపరం లేదు. జనమే ఓట్లతో సమాధానం చెప్పారు. చంద్రబాబే సూసైడ్…
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై మండిపడ్డారు మంత్రి మేరుగ నాగార్జున. టీడీపీ అభిప్రాయాలని ఇతర మార్గాల ద్వారా చెప్పించారు. సంక్షేమ పథకాలు ఆగిపోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఈ కుట్రలని గమనించాలని కోరుతున్నా. అంబేద్కర్, పూలే , పెరియార్ రామస్వామి ఆలోచనలు ఈ రోజు అమలవుతున్నాయి. చంద్రబాబుకి ఎవరైనా ఓటేస్తే ఈ పథకాలు ఆపేస్తామని చెప్పకనే చెప్పారు. జగనన్న అమ్మ ఒడి ద్వారా 44 లక్షలపైన తల్లులకి అమలు చేస్తున్నాం అన్నారు మంత్రి…
అమరావతి: సచివాలయంలోని తన కార్యాలయంలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఈరోజు ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెండు కీలక ఫైళ్లపై ఆయన తొలి రెండు సంతకాలను చేశారు. తొలి సంతకాన్ని విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్ళు కట్టించే ఫైలుపై చేశారు. రెండో సంతకాన్ని గృహ నిర్మాణ లబ్దిదారులకు ఇచ్చే 90 బస్తాల సిమెంట్‌ను 140 బస్తాలకు పెంచే ఫైలుపై చేశారు. అనంతరం సీఎం…
నూతనంగా కొలువుతీరింది జగన్ 2.O కేబినెట్. మంత్రులకు జగన్ శాఖలు కేటాయించారు. సోమవారం ఉదయం మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే మంత్రులకు శాఖలు కేటాయించారు. మొత్తం కేబినెట్‌లో ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఆంజాద్ బాషా, నారాయణ…
ఉత్తర ప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కరోనా సోకుతున్నది. తాజాగా కరోనాతో యూపీ మంత్రి విజయ్ కశ్యప్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు. ముజఫర్ జిల్లాలోని చార్తవాల్…