టీడీపీ పాలనలో చేసిన అప్పులతో తాము ఇబ్బందులు పడుతున్నామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. టిడ్కో ఇళ్లపై మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపారు. అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం. గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం. డిసెంబరుకు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక రెడీ చేశామన్నారు. గత ప్రభుత్వాల మాదిరి అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికి వదలటం లేదు. మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం…
మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ వార్తలు వచ్చాయి. దాన్ని ఆరోజే ఖండించాను. మాపై ఇలాంటివి రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ నేను పాకులాడలేదు. ఆరోజు చెప్పగానే 24 మంది రాజీనామా చేశాం. మంత్రి పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా ఉంటుందన్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు. నేను వైయస్సార్ ఫ్యామిలీ…
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా పడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను…
ఏపీలో పీఆర్సీపై స్పష్టత నెలకొనడం లేదు. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11వ పీఆర్సీపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేసారు. మరోమారు సమ్మెకు పూనుకున్నారు. దీంతో ఏపీలో మరోసారి పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. సీఎం ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. అయితే దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీకి అంగీకరించారాని అయన అన్నారు. మళ్లీ ఇప్పుడు ఉద్యోగ…
ఏపీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా అదుపులో వుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.సంక్రాంతి శెలవుల తర్వాత స్కూళ్లు రీ-ఓపెన్ అయ్యాయి. ఎంత మంది వచ్చారనే అటెండెన్స్ రిపోర్టులు తెప్పించుకుంటున్నాం అన్నారు. గత రెండేళ్లల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేకపోయాం.విద్యార్ధుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఇస్తున్నాం.సుమారు 22 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ వేసేశాం.విద్యార్ధులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తైంది.టీచర్లకు 100 శాతం వ్యాక్సినేషన్ వేశాం.ఎకడమిక్ ఇయరుని ముందుగా నిర్ణయుంచుకున్న…