సీఎం జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం దళితులను బలిపశువుల్ని చేస్తున్నారని విమర్శించారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మంత్రి ఆదిమూలపు సురేష్ అర్దనగ్న సురేష్ గా మారిపోయారు.జగన్ రెడ్డి తన స్వార్దం కోసం దళితుల్ని బలి పశువుల్ని చేస్తున్నారు.కోడికత్తి డ్రామాకు శీను అనే దళిత యుకుడిని వాడుకుని జగన్ రెడ్డి సీఎం పీఠం ఎక్కారు.ఇప్పడు అదే శీను జైల్లో మగ్గుతున్నా కనీసం పట్టించుకోవటం లేదు ?యర్రగొండపాలెం కంటే ముందు మార్కాపురంలో చంద్రబాబు పర్యటన జరిగింది.అక్కడ ఎమ్మెల్యే చేత జగన్ రెడ్డి చొక్కా ఎందుకు విప్పించలేదు? అతను తన సామాజికవర్గం వాడనా..?
Read Also: Tulasi Reddy: మంత్రి సురేష్ ని బర్తరఫ్ చేయాలి
ఉన్నత విద్యావంతుడు, దళిత మంత్రిని చొక్కా విప్పి నడిరోడ్డుపై నిలిబెట్టిన ఘనత జగన్ రెడ్డిదే.లోకేష్ అనని మాటలు అన్నట్టు చిత్రకరించి నిరసన పేరుతో దాడులు చేస్తారా? దళితులపై దాడులు జరిగినపుడు సురేష్ ఎందుకు చొక్కా విప్పి నిరసన తెలపలేదు?దళిత యువకుడు సుబ్రమణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేస్తే సురేష్ రక్తం ఎందుకు మరగలేదు?పోలీసులు జగన్ రెడ్డికి ఊడిగం చేయడం సిగ్గుచేటు. చంద్రబాబుపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమో ఎస్పీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు వంగల పూడి అనిత.
Read Also: Chalaki Chanti: చలాకీ చంటికి గుండెపోటు.. పరిస్థితి విషమం