Minister Sridhar Babu: రాష్ట్ర ఐటీ రంగం అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కి హైదరాబాద్ లో గ్లోబల్ సమీట్ నిర్వహించామన్నారు. అంతర్జాతీయ సంస్థలన్నీ తీసుకురావడంతో పాటు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని తెలిపారు. ఐటీ రంగమనేది టాలెంట్ ఆధారంగా నడుస్తుందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఐటీ ఉద్యోగాలు పొందేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు. స్కిల్స్ ఉన్న వారు ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 3 లక్షలకు ఐటీ ఎగుమతులు చేరాయని మండలిలో మంత్రి శ్రీధ్ తెలిపారు. ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ ఎక్కడికి పోలేదు రాష్ట్రంలోనే ఉందన్నారు. త్వరలోనే ఫాక్స్ కాన్ మల్టీ నేషనల్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్నారు. టీఎస్ ప్రైడ్ యధావిధిగా కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు.
Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..