RK Roja: మన్యం వీరుడికి పవన్ ఇచ్చే విలువ ఇదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ.. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు. తెలుగువీరలేవరా.. దీక్ష బూని సాగరా..! అంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ప్రధాని.. స్వాతంత్ర్య ఉద్యమంలో యావత్ భారతావనికే స్ఫూర్తిగా నిలిచిన మన నాయకుడు అల్లూరి సీతారామ రాజు పుట్టిన నేల మీద మనమందరం కలుసుకోవడం మన అదృష్టమంటూ తెలుగులో మాట్లాడారు. ఇక, ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి, ఇతర మంత్రులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. ఇదే సమయంలో.. ఆ కార్యక్రమానికి హాజరుకాని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు.
Read Also: TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Kanipakam Vinayaka Brahmotsavam 2026: కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఏర్పాట్లు
- Rain Alert: కొనసాగుతోన్న అల్పపీడనం.. రాబోయే 24 గంటల్లో ఆ 13 జిల్లాలో వర్షాలు!
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
భీమవరంలో ఈ రోజు జరిగిన కార్యక్రమం ఒక అపురూప ఘట్టం.. పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఘన విజయం చేశారని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. అయితే, ఈ కార్యక్రమానికి రావాలని పిలిచినా టైం లేక రాలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అంటున్నారు.. మన్యం వీరుడికి పవన్ ఇచ్చిన విలువ ఎలాంటిదో దీన్ని బట్టి అర్ధం అవుతుందని వ్యాఖ్యానించారు.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడి విగ్రహ ఆవిష్కరణలో భాగం కానివాళ్లు దురదృష్టవంతులు అని కామెంట్ చేశారు మంత్రి ఆర్కే రోజా.. కాగా, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసిన పవన్ కల్యాణ్.. అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు అని కీర్తించారు. ప్రజల సంపద, మాన ప్రాణాలకు పాలకులే భక్షకులైన నాడు, వారు అవినీతి, అశ్రిత పక్షపాతానికి లోనైన నాడు ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకలించే వీరులు ఉదయిస్తారని చెప్పేందుకు అల్లూరి సీతారామరాజే నిలువెత్తు తార్కాణం అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!