ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఓ వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో బీజేపీ, జనసేన పొత్తుల నుంచి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పేరు ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆత్మకూరు ఉప ఎన్నికలకు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ పోటీ చేయడం లేదు. కానీ.. బీజేపీ పోటీకి సిద్ధమైంది. అయితే నెల్లూరు జిల్లాలో తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ.. పథకాలు.. గౌతమ్ రెడ్డి చేసిన అభివృద్ధిపై ఓట్లు అడుగుతామని ఆమె వెల్లడించారు. బీజేపీ పోటీ నామమాత్రమే అన్న రోజా.. పవన్ కల్యాణ్‌కు మూడు ఆప్షన్లు లేవు.. ఓకే ఆప్షన్..ఓడిపోవడమే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయారని, టీడీపీకి ఇంకా 50 స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరని లోకేష్ చెప్పాడని, ఇలాంటి పార్టీలు ఎలా వైసీపీకి పోటీ ఇస్తాయంటూ ఆయన సెటైర్లు వేశారు.