ఏపీఎస్ ఆర్టీసీలో డ్రైవర్లు 1,275, కండక్టర్లు 789 మంది కొరత ఉందని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానంగా మాట్లాడిన ఆయన.. ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.. EHS ద్వారా సదుపాయాలు అన్నీ అందడం లేదని, రిఫరల్ సరిగా జరగడం లేదని మా దృష్టికి వచ్చిందని వివరించారు.. అయితే, ఉద్యోగుల మెడికల్ ఫెసిలిటీల విషయంలో చర్యలు తీసుకుంటాం అన్నారు..
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడు.. ఈనెల 11వ తేదీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడితే జగన్ రాయలసీమ బిడ్డగా ఒప్పుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
కడప ఎయిర్‌పోర్టులో కడప - హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, చైతన్య రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఏడాదిగా కడప-హైదారాబాద్ విమాన సర్వీసులు లేవని.. ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు.
వ్యాపారులను వేధించే నైజం మాది కాదు.. వ్యాపారులను ఎవరైనా వేధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడమే మా ప్రభుత్వ ధ్యేయం అన్నారు. వ్యాపారులను ఎవరు వేధించినా సహించేది లేదన్నారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో కువైట్‌లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతోన్న కవిత.. స్వదేశానికి చేరుకుంది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిగారిపల్లికు చెందిన మహిళ తిరుపతి కవిత... బతుకుతెరువు కోసం కువైట్ వెళ్లి అక్కడ తీవ్ర ఇబ్బందులు పడిన బాధితురాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. సంబంధిత ₹3,01,116/- రూపాయల చెక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సచివాలయంలో అందజేశారు.
Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అని ఆరోపించారు. లక్షన్నర ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.. దేవాలయ, మఠం, ప్రభుత్వ భూముల దోపిడీ జరిగింది.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 14 మండలాల్లో భూ అక్రమాలకు పాల్పడింది.. వైసీపీ నేతలు భూ అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది.