ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ ఆదేశానుసారం వచ్చి సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని ఆయన తెలిపారు. సాయి కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమని, సాయి గణేష్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించడం అతని తప్పా అని ఆయన అన్నారు. మజ్దూర్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా టీఆర్‌ఎస్ పార్టీ తప్పులను ఎత్తి…
రైతుల ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలని, కేసీఆర్ కుటుంబంపై ఈడీ విచారణ జరపాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రౌడీ గా మారిపోయి పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఏడేళ్ల నుంచి రాష్ట్ర సమితి రాబందుల సమితి గా మారిందన్నారు. పోలీసు యంత్రాంగంను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్ట్ లు, ప్రశ్నించే…
ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త వ్యవహారం సంచలనంగా మారిపోయింది… నిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ.. సోషల్‌మీడియాలోను ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడుతుంటాడు సాయి గణేష్… వచ్చే నెల నాలుగో తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.. కానీ, ఇంతలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయి గణేష్ చనిపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి…
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్షచూపుతోందని టీఆర్‌ఎస్ మంత్రులు అంటున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలుపై ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రుల బృందం నేడు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణ చూస్తారని ఆయన హెచ్చరించారు. ధాన్యం సేకరణ పై మోడీ, కేంద్రం స్పందించకపోతే ఉద్యమ బాట పడతామని ఆయన వెల్లడించారు. ఆహారపు అలవాట్ల గురించి పీయూష్ గోయల్ మాట్లాడతారు అని ఆయన మండిపడ్డారు. ఉగాది తర్వాత…
సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి నిస్సహాయ ప్రకటన చేసినా అర్థం ఉందని, కానీ ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఉంది కూడా నిస్సహాయంగా ఉన్నారని మంతి పువ్వాడ అజయ్ విమర్శలు గుప్పించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రాదని నిరుద్యోగ యువత ఆశల మీద కిషన్ రెడ్డి నీళ్లు చల్లారని ఆయన మండిపడ్డారు. బయ్యారంలో ఉక్కు నిల్వలు ఉన్నాయని జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రంది ఉక్కు…