వైసీపీ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయమని.. ఈ విషయాన్ని ఎల్లో మీడియా గుర్తు పెట్టుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికల ఫలితాలు మార్చే పరిస్థితి ఉండదని చురకలు అంటించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశారని… గ్రామాల్లోకి వెళితే కేవలం ఇల్లు కోసం అర్జీలు, లేదా భూ వివాదాలపై మాత్రమే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. జగనన్న శాశ్వత భూ హక్కు,…
తిరుపతి : జగన్ కు సమానంగా లోకేష్ ను తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు పిచ్చి ఆలోచన అని… గత ఎన్నికల కన్నా వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇక రిటైర్మెంట్ తీసుకొని ప్రజాసేవ చేసుకోవాలి..అదే మంచిదన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలోనే చంద్రబాబు మళ్లీ పోటీ చేయాలని కోరుకుంటున్నానని… జగన్ చేసిన అభివృద్ధి వల్లే కుప్పంలో భారీ విజయం సాధించామని వెల్లడించారు. గత పాలకులు ఎన్నో ఏళ్లుగా స్థానిక పోరు జరపకుండా…