తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను పుట్టించిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
సింహం సింగిల్‌గానే వస్తుంది.. మళ్లీ జగనే సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో బలమైన ప్రభుత్వం ఉంది… ప్రతిపక్షాలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. పొత్తులు పొత్తులు అని మాట్లాడుతున్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు బట్టలు చించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు పొత్తులు అంటున్నాయి.. సింహం సింగిల్ గానే…