టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న అతికొద్ది మంది సీనియర్ నేతల్లో ఒకరు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎన్ ఎం డి ఫరూక్. ఫ్యాక్షన్ జిల్లాలో రక్తం మరకలు అంటకుండా, అధిష్టానానికి దగ్గరగా వుంటూ పొలిటికల్ బండి లాగించేస్తున్నారాయన. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా... వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది.
ఏపీ సర్కార్ మైనార్టీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది.. రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థులకు టెట్ పరీక్ష కోసం మైనార్టీ సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ప్రకటించారు.. ఈ సెంటర్ల ద్వారా.. రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్(బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు..