ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంటిమిట్ట ఎంపీపీ అక్కి లక్ష్మి దేవి, ఉప మండలాధ్యక్షురాలు గీతా.. తెలుగుదేశం పార్టీలో చేరారు.. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరగా, వారికి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.. టీడీపీ కండువాలు కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు..
TDP Mahanadu: కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కార్యక్రమం అపూర్వ విజయాన్ని సాధించిందదని, రాయలసీమకు చెందిన 24 నియోజకవర్గాల నుండి వచ్చిన నాలుగు లక్షల మందికి పైగా టీడీపీ శ్రేణుల ఉత్సాహభరితంగా పాల్గొనడం ఈ విజయానికి నిదర్శనమని, ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తాజాగా జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. సంవత్సర కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో…
అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది.. ముఖ్యంగా రెవిన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవిన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు.. ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు.. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా.. మంత్రిగా కాదు.. జిల్లాలోని ప్రతి…
ఉమ్మడి కడప జిల్లాలో జడ్పీ చైర్మన్ దక్కించుకున్నామంటూ వైసీపీ వారు కేకులు కోసుకోవడం, దండలు వేసుకోవడం వంటివి చేస్తూ హడావిడి చేస్తున్నారు.. ఉమ్మడి కడప జిల్లాలోని 50 జడ్పీటీసీలు రాజీనామాలు చేసి ఈరోజు ఎన్నికలకు వస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుందంటూ.. వైసీపీ నేతలకు సవాల్ విసిరారు..
స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంపుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా శుభావార్త చెప్పారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. స్పోర్ట్స్ కో రిజర్వేషన్ 2 శాతం నుండి 3 శాతానికి పెంచనున్నట్టు వెల్లడించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 విజన్ తో గ్లోబల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారుతుందని తెలిపారు.. స్పోర్ట్స్ కోటాలో 2 శాతం నుండి 3 శాతానికి రిజర్వేషన్ పెంచుతాం.. ఒలంపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వారికి ఉద్యోగ…
రాయచోటిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ లో సంవత్సరం పాటు ఉచితంగా మూడు పూటల ఆహారం అందిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. రాయచోటిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతో మూడు పూటల ఆహారం అందిస్తామని.. ఇందుకు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు..
Minister Ramprasad Reddy: అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రినీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాలను మంత్రి పరిశీలించారు.