తెలంగాణలో వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరలు పెరుగుతుంటే మోడీ ఆనాడు ట్వీట్ పెట్టారు, రోడ్లు ఎక్కి ఆందోళన చేశారని ఆయన గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ చాతనవడం లేదు దిగి పొమ్మని మోడీ మాట్లాడారని, ఇప్పుడు ప్రశ్నిస్తే దేశ ద్రోహివి అంటూ నోటికొచ్చే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రష్యా యుద్ధం పేరు చెప్పి ఆయిల్…
ఇప్పటికే పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. వరుసగా పెరుగుతూ సామాన్యుడికి గుది బండగా మారిన పెట్రో ధరలపై గురు పెట్టారు.. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ బహిరంగలేఖ రాశారు.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని దుయ్యబట్టారు.. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే…
నేడు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో విప్రో కన్య్సూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థ విప్రో అని ఆయన అన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ లాంటి వ్యక్తి మన మధ్య ఉండడం అదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి ఆయన అని, 300 కోట్ల పెట్టుబడులు తో ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారన్నారు. 90 శాతం…
మహేశ్వరంలో విప్రో కన్య్సూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విప్రో ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. ఎన్ని కంపెనీలు వచ్చినా స్థానికులుకి ఉద్యోగాలు వస్తేనే ఉపయోగము ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. స్థానికులకు ఉద్యోగులు వచ్చేందుకు అనుగుణంగా ఒప్పందాలు జరిగాయన్నారు. విప్రో హైద్రాబాద్ కి రావడం ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు.…
తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరం అన్నారు మంత్రి కేటీఆర్. దీనివల్ల 200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరోక్షంగా వేలాదిమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పరిశ్రమలకు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారన్నారు. 50 బిలియన్ డాలర్లుగా ఉన్న జీనోమ్ వ్యాలీ పెట్టుబడులు.. 2030 కల్లా 100 బిలియన్లకు…
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్. ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు…
రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజీలతో, కొత్తకొత్త ఆలోచనలతో జపాన్ లాంటి దేశాలు ముందున్నాయి. అందుకు కారణం అక్కడి విద్యా విధానం. అయితే టెక్నాలజీలో ముందున్న దేశాల పక్కన మన భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇందుకు విద్యా విధానంలో మార్పుల తప్పనిసరి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు అడుగులు వేయాలి. ఈ విధంగా ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం…
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతూనే వుంది. పెట్రోలియం కంపెనీలు ఏప్రిల్ 4 సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 40 పైసలు పెంచాయి. ఇంధన ధరల తాజా పెరుగుదల తర్వాత, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.81కి, డీజిల్ లీటరుకు రూ.94.07కి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 118.81, డీజిల్ రూ. 103.04. చేరుకుంది. గత 14 రోజుల్లో 12వసారి చమురు పెట్రోల్, డీజిల్ రేట్లు…
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం వడ్ల చూట్టూనే తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో.. పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్. ఈనెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. Read Also: Minister KTR : కిషన్…
ధాన్యం కోనుగోళ్ల విషయమై బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరింది. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నేడు మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర బీజేపీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మానసిక…