తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణ మంత్రులు వినతి పత్రం అందజేశారు. అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్…
Congress Leader Madhu Yashki Goud Fired on Minister KTR. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నేతలు నువ్వానేనా.. అనే విధంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డాగా మారిందని, ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారిందన్నారు. తమ్మీ తారక రామారావు… 50 యెండ్లలో ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నావు.. కాంగ్రెస్ ఐటీకి హైదరాబాద్ నీ హబ్ గా చేసింది…
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌కి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వుంది. నిత్యం రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా తెలంగాణ మంత్రి కె.తారకరామారావు హాట్ కామెంట్స్ చేశారు. ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఎన్టీయే ప్రభుత్వం అచ్చెదిన్ జరుపుకోవాలని వేసిన ఒక కార్టూన్ కి స్పందించారు. ఆ కార్టూన్ ని రిట్వీట్ చేశారు. తాను కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వాస్తవాలు వివరిస్తూనే వుంటానని అది చూసి తట్టుకోలేనివారు దయచేసి తనను…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి ఇంధనం ధరలు పెరుగుతూ ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై, బీజేపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ట్విట్టర్‌లో.. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీవాళ్లు మొదటి నుండి చెపుతూనే ఉన్నారు మనకే అర్దం కావడం లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా డబుల్ ఇంజన్ అంటే.. పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం,…
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవల అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే సంస్థలు ఎంతో బిజీబిజీగా గడిపారు. అంతేకాకుండా అమెరికాలో తన జ్ఞాపకాలను కూడా నెమరువేసుకున్నారు. అయితే కేటీఆర్ సోదరి, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య కూడా అమెరికాలోనే విద్యనభ్యసిస్తున్నాడు. అమెరికా పర్యటనలో ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్.. తన మేనల్లుడు ఆదిత్యను కలిసి కొంతసేపు గడిపారు. ఈ సందర్భంలోనే వారిద్దరూ కలిసి దిగిన ఫోటోను…
ఒక్కొక్కరికి ఒక్కో అభిమానం ఉంటుంది. కొందరికి సినిమా స్టార్లు అంటే పిచ్చి. ఇంకొందరికి రాజకీయ నేతలంటే అభిమానం. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు. దీంతో కేటీఆర్ సీఎం కావాలంటూ ఏపీలోని ఓ అభిమాని బైక్ యాత్ర చేపట్టాడు. గుంటూరు జిల్లాకు చెందిన బాలరాజుగౌడ్ అనే వ్యక్తి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి యాదాద్రి వరకు బైక్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. తన బైక్…
విద్యార్ధి జీవితం మరపురాని అనుభూతినిస్తుంది. ఎక్కడో పుట్టి, ఎక్కడో చదువుకుని మళ్ళీ తమ స్వంత గడ్డపై అడుగుపెట్టాక పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటే ఆ ఆనందం మామూలుగా వుండదు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తెలంగాణకు తీసుకురావడంలో విజయం సాధించిన మంత్రి కేటీఆర్ అమెరికా టూర్‌లో బిజీగా వున్నారు. తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి మరియు ఉద్యోగ జీవిత కాలానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో…
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతిధులతో భేటీ అవుతున్నారు.. రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్ని రాష్ట్రంలో ఉన్న అవకాశాలను, సదుపాయాలను వివరిస్తూ.. పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు.. ఇక, తాజాగా, హైదరాబాద్ నగరంతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చిన అమెరికాలోని బోస్టన్ సిటీ.. బోస్టన్‌లో జరిగిన గ్లోబల్ ఇన్నోవేషన్ 2022 Health Care At a Glance సదస్సులో.. మసాచుసెట్స్ రాష్ట్ర గవర్నర్ చార్లీ బేకర్, మంత్రి కేటీఆర్…
ఇటీవల సోషల్ మీడియాలో వుడెన్ ట్రెడ్ మిల్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ చూసినా దీని గురించే నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. సహజంగా ఇంట్లోనే ఉండి వ్యాయమం చేసే పరికరాల్లో ముఖ్యమైనది ట్రెడ్‌మిల్. ఇది నడక, జాగింగ్, రన్నింగ్ వంటి వాటిని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చేసుకునే అత్యుత్తమ పరికరం. ఇలాంటి పరికరాన్ని ఓ వ్యక్తి ఇనుము, ఇతర లోహాలతో కాకుండా కేవలం చెక్కతో తయారు చేశాడు. ఈ వుడెన్ ట్రెడ్ మిల్‌ను తయారుచేసిన వ్యక్తిని అందరూ…
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఐఐటీ హైదరాబాద్ లో మెడికల్ ఎక్విప్ మెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జిల్లా కలెక్టర్,ఎస్పీ పాల్గొన్నారు. ఐఐటి హైదరాబాద్ లో జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ను ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. ఐఐటి హైదరాబాద్ లో తయారు చేసిన జీవన్ లైట్ స్మార్ట్ మెడికల్ ఐసియు వెంటిలేటర్ ప్రారంభించడం సంతోషంగా ఉంది.…