తెలంగాణ శాసన మండలిలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ పై కీలక విషయాలు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ కి 2016లో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. 2017లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవరించడం వల్ల రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు వెనుకబడుపోయిందని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత RRR ను పట్టాలెక్కించామని అన్నారు.…
తన సొంత ఖర్చులతో రేవతి పిల్లలిద్దరికీ చదువులు చెప్పిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈనెల 4న పుష్ప 2 బెనిఫిట్ షో కోసం సంధ్య థియేటర్‌కి రేవతి, భాస్కర్, వారి పిల్లలు శ్రీ తేజ, సాన్విక వెళ్ళారని అన్నారు.
గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వలేదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు దగ్గర చేస్తున్నామన్నారు. ఇక, ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన తెలిపారు.