మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో మిర్చి యార్డులోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, రానున్న మూడు మాసాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసే విధంగా కార్యచరణ రూపొందించాం అని చెప్పారు. మిర్చి యార్డులోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. గుంటూరు మిర్చి యార్డు ఆసియాలోని అతిపెద్ద మిర్చి యార్డుగా రైతులకు సేవలు అందిస్తుందని మంత్రి…
అప్కాబ్ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. గత ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేయనున్నట్టు వెల్లడించారు.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టం రద్దు చేయనున్నాం.. త్వరలో కొత్త చట్టం తీసుకొస్తామని పేర్కొన్నారు.. చిట్టచివరి కౌలు రైతుకు సైతం న్యాయం జరగాలి అనేది తమ ప్రభుత్వ ఉద్దశ్యంగా స్పష్టం చేశారు.
చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ రోజు మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో అప్కాబ్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆప్కాబ్ వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు