నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గ అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గు మన్నాయి. ఇవాళ జరగాల్సిన నిడమనూరు మార్కెట్ చైర్మన్ ప్రమాణస్వీకారానికి ముందే ఏర్పాటు ఫెక్సీలను చింపుకొని వీధిన పడ్డారు. రోడ్ల పైనే పరస్పరం వాగ్వివాదాలకు దిగడం కలకలం రేపింది.
గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మునుగోడుకు మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు.