Harish Rao: పొరపాటున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే పదేండ్లు వెనక్కిపోతామని మంత్రి హరీష్ రావు అన్నారు. అబద్దాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాకలో మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎవరికి హాని చేయడని ఆయన అన్నారు. కొంత మంది ఓ వ్యక్తిని రెచ్చగొట్టి, బాగా తాగించి కత్తితో దాడి చేయించారని ఆయన ఆరోపించారు. గంట లేట్ అయితే ప్రభాకర్ రెడ్డి ప్రాణానికే ప్రమాదం ఉండేదన్నారు.
Harish Rao: తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట నుంచి మరోసారి బరిలోకి దిగిన హరీశ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Harish Rao: ఢిల్లీలో అవార్డులు ఇస్తారు.. గల్లీలో తిడతారని కేంద్రంపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజిగిరి నియోజికావర్గం పరిధిలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో బిజెపి పార్టీ నుండి భారీ చేరికలు జరిగాయి.
ముషీరాబాద్ కు చెందిన నగేష్ ముదిరాజ్ మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 2018లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఎన్నికలకు వచ్చింది అని ఆయన గుర్తు చేశారు.
CM KCR: సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (సీఎం కేసీఆర్) దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నాము అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. డాక్టర్లు వారి ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నరు.. ఆరోగ్యం ప్రస్తుతం కుదుటపడింది.. ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం ఐసీయూలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది.. ఇంత ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. కోడికత్తి అని చిల్ల�
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు.