Harish Rao: కొండగట్టుకు హరీశ్ రావు.. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట నుంచి మరోసారి బరిలోకి దిగిన హరీశ్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజామున కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి బయల్దేరారు. దారిలో హరీష్ రావు కారును పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల నిబంధనల మేరకు మంత్రి హరీశ్ వాహనాన్ని పోలీసులు ఆపి విచారణ చేపట్టారు. హరీశ్‌రావు తన మద్దతుదారులు, బీఆర్‌ఎస్ నేతలతో కలిసి పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి కారుతో పాటు ఆయన ప్రయాణిస్తున్న ఇతర వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేశామని… అదే క్రమంలో మంత్రి కాన్వాయ్‌ని కూడా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. సహకరించిన మంత్రికి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల తనిఖీ అనంతరం మంత్రి కాన్వాయ్ కొండగట్టు ఆలయం వైపు వెళ్లింది. కొండగట్టు ఆంజనేయస్వామి చెంతకు నామినేషన్ పత్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
దర్శనానంతరం మంత్రి హరీశ్‌రావును ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. స్వామివారి ఆశీస్సులతో సిద్దిపేటలో మళ్లీ బంపర్ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని…బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే, తాజాగా నిజామాబాద్‌లో సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జరుగుతున్న జన ఆశీర్వాద సభకు హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో వెళ్లగా.. ఆయన కాన్వాయ్ రోడ్డు మార్గంలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాన్వాయ్‌లోని వాహనాలు నిజామాబాద్ మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా, నిరసన ప్రదేశంలో కేసీఆర్ కాన్వాయ్ తనిఖీ చేశారు. దీంతో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య తారతమ్యం లేకుండా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసుకోవడంలో భాగంగానే ఈ విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్‌లో సెల్ఫీలు పెట్టాలని సూచన
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!