ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియాలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు.