పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వాఎక్స్ ఇండియా-2022 పేరిట ఆక్వా ఎక్స్ పో జరగనుంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరగనున్న ఆక్వా ఎక్స్ పోలో వివిధ కంపెనీలు పాల్గొననున్నాయి. ఆక్వా ఎక్స్ ఇండియా 2022 కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి సీదిరి అప్పలరాజు.ఫిషరీస్ యూనివర్శిటీని అందుబాటులోకి తెస్తున్నాం. ఈ నెల 28వ తేదీన ఫిషరీస్ యూనివర్శిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఆక్వా సెక్టార్ ఇప్పుడు దేశానికి గ్రోత్ ఇంజన్ లాంటిదన్నారు మంత్రి.
Read Also: Weight Loss: ఇవి నానబెట్టి తింటే.. బరువు తగ్గడంతోపాటు మరెన్నో లాభాలు
దేశం మొత్తం మీద 70 శాతం ఆక్వా కల్చర్ ఏపీ నుంచే ఉంటోంది.ఆక్వా రంగానికి జగన్ ప్రభుత్వం చేయూత ఇస్తోంది.ఆక్వా కల్చరులో సీడ్ టు సేల్ వరకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం.ప్రస్తుతం 10 ఎకరాల్లోపు ఆక్వా సాగు చేసే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ. 1.50కే ఇస్తున్నాం.ఏపీ ఆక్వా సీడ్ యాక్ట్ తెచ్చాం.ఆర్బీకే వంటి వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నాం.ప్రతి ఆర్బీకేలోనూ విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లని పెట్టాం.నక్కపల్లి దగ్గర ఆక్వా కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.
ఎక్కడికక్కడ ఆక్వా లాబులు ఏర్పాటు చేశాం.ఆక్వా రంగంలో 11 శాతం గ్రోత్ నమోదు చేయగలిగాం.భీమవరంలో ఆక్వా ఎక్స్ ఇండియా-2022 పేరుతో ఎక్స్ పో ఏర్పాటు చేయడం సంతోషం ఆక్వా ఎక్స్ పో ద్వారా రైతులకు నాలెడ్జ్ షేరింగ్ జరుగుతుందని భావిస్తున్నాం అన్నారు మంత్రి సీదిరి అప్పలరాజు.
Read Also: Munugode By Poll : మునుగోడు ఓట్లపై నేడు హైకోర్టులో విచారణ