చంద్రబాబునాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. తనకు ఇవే చివరి ఎన్నికలన్న కామెంట్లపై ఘాటుగా స్పందించారు. జగన్ ని చంద్రబాబు ఏం పీకగలరన్నారు.తెలుగు దేశం పార్టీ రాజకీయ భవిష్యత్తును స్వయంగా చంద్రబాబే సమాధి కడుతున్నారు. బీజేపీ కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోంది. చంద్రబాబు రాజకీయ నిష్క్రియాత్మక పరిస్థితికి, చేతకాని తనానికి చివరి ఎన్నికలు అన్న వ్యాఖ్యలు నిదర్శనం. తీవ్రమైన ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. రాజకీయం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడన్నారు.
చంద్రబాబు భార్య అయినా తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఎందుకు వారించటం లేదో అర్థం కావటం లేదు. ఎందుకీ చేతకాని రాజకీయాలు??భార్యను అడ్డం పెట్టుకొని ఎంత కాలం చంద్రబాబు రాజకీయాలు చేస్తాడు? అంత హేయకరమైన చర్య ఇది. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. చంద్రబాబు చరిత్ర శనక్కాయలు దొంగతనం చేయటం దగ్గర నుంచి మొదలవుతుందన్నారు సీదిరి అప్పలరాజు.