ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు మినహాయించాలో చెప్పాలంటూ నిలదీసింది అత్యున్నత న్యాయస్థానం… ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.. పరీక్షల ఆవశ్యకతను సుప్రీంకోర్టుకు వివరించామన్న ఆయన.. పరీక్షల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కూడా కోర్టు దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు.. ఇంటర్ పరీక్షల మార్కులు ఎంసెట్‌కు ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటాం అనే విషయం చెప్పామని.. ఈ విషయాలన్నీ అఫిడవిట్ రూపంలో రెండు రోజుల్లో సమర్పించాలని కోర్టు ఆదేశించిందని.. ఆ మేరకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందని తెలిపారు. ఇక, తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. కాగా, ఏపీతో పాటు కేరళ సర్కార్‌పై కూడా సుప్రీంకోర్టు సీరియస్ కాగా.. పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని సుప్రీంకోర్టుకు తెలియజేసింది కేరళ సర్కార్..