మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన క్రితిసనన్ ఆ తర్వాత 2014 లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయ్యింది. తర్వాత అదే సంవత్సరం ‘హీరోపంటి’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, కృతికి బాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తాయి. ‘హీరోపంటి’ లో ఆమె నటన, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత ఆమె నటించిన ‘దిల్వాలే’ సినిమాతో కూడా…
‘మహానటి’ సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ ఖాతాలో మరో హిట్ లేదు. అటు హీరోలతో నటించిన సినిమాలో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఆడియన్స్ ను పూర్తిగా నిరాశపరిచాయనే చెప్పాలి. ఒక్క తమిళ ‘సర్కార్’ మాత్రమే పర్వాలేదనిపించింది. మిగిలిన అన్ని సినిమాలు పరాజయం పొందాయి. ప్రస్తుతం కీర్తి నటించిన ‘మరక్కార్, గుడ్ లక్ సఖి, అన్నత్తే’ సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తమిళ ‘సాని కాయిదం, వాశి’ సినిమాలతో పాటు తెలుగులో ‘సర్కారువారి…
టాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని “మిమి” సినిమా రివ్యూ ఇచ్చేసింది. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన చిత్రంలో పంకజ్ త్రిపాఠి, కృతి సనన్ లతో పాటు సుప్రియ పాథక్, సాయి తంఖంకర్, మనోజ్ పహ్వా, జయ భట్టాచార్య కూడా కీలక పాత్రల్లో కన్పించారు కన్పించారు. జూలై 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా సినిమాను వీక్షించిన సమంత “మిమిలో కృతి సనన్ మీరు చాలా అద్భుతంగా నటించారు.…
ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచగా సింగర్ అనన్య బిర్లా పాడిన ‘హిందుస్తానీ వే’ గీతం భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల కోసం టోక్యో వెళ్ళిన క్రీడాకారుల పెదాలపై విశేషంగా నానుతోంది. అంతేకాదు… ఇండియన్ స్పోర్ట్స్ పర్శనాలిటీస్ పై చిత్రీకరించిన ఈ గీతానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చిత్రం ఏమంటే… దేశభక్తిని, క్రీడాస్ఫూర్తిని మిళితం చేస్తూ సాగే ఈ పాటకు మించిన స్పందన నాలుగు రోజుల క్రితం విడుదలైన రెహ్మాన్ మరో సాంగ్…
నాజూకు నడుము భామలు ఒక్కసారిగా లావైపోతే అస్సలు బాగోదు. కానీ ఏం చేస్తాం… ‘స్టోరీ డిమాండ్ చేసింది’ అంటూ కొందరు అందాల ముద్దుగుమ్మలు కథ కోసం కేజీల కొద్ది బరువు పెరిగేశారు. 2015లో వచ్చిన ‘సైజ్ జీరో’ కోసం అనుష్క అదే పనిచేసింది. సన్నగా కనిపించాల్సిన సన్నివేశాల్లో మొదట నటించేసి, ఆ తర్వాత పాత్ర కోసం విపరీతంగా లావైపోయింది. ఇప్పటికీ మనుపటి శరీరాకృతిని అనుష్క పొందలేకపోయింది. కానీ చిత్రంగా భూమి పెడ్నేకర్ మాత్రం ఆ విషయంలో సక్సెస్…
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సరోగసి డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది. నిన్న ఈ చిత్రానికి సంబంధించి కృతి సనన్ ఫస్ట్ లుక్ విడుదల కాగా, నేడు మరో అప్డేట్ ను అందించారు మేకర్స్. జూలై 13న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాబోతోందని తెలుపుతూ ఓ టీజర్ ను విడుదల చేశారు. అందులో కృతి సనన్ ప్రెగ్నెన్సీ జర్నీని చూపించారు. అంతా అనుకుంటున్నట్లుగా కాకుండా ఎదో స్పెషల్ గా ఉంటుందని హామీ…