Russia: పాకిస్తాన్ తయారీ ఫైటర్ జెట్ JF-17 కోసం రష్యా ఇంజన్లు ఇస్తోందనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. మోడీ దౌత్య విధానం విఫలమైందని ఆరోపించింది. అయితే, ఈ ఊహాగానాలను రష్యా ఖండించింది. నిజానికి, JF-17 యుద్ధ విమానం కోసం పాకిస్తాన్‌కు RD-93 ఇంజిన్‌లను సరఫరా చేయడం వల్ల వాస్తవానికి భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుందని రష్యన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు.
China J-35A: ప్రపంచానికి సవాల్ విసిరే ఆయుధ సంపత్తిని శనివారం చైనా ప్రదర్శించింది. ఇందులో ఒక ఆయుధం ప్రత్యేక ఆకర్షిణగా నిలవడమే కాకుండా సైలెంట్ కిల్లర్ అనే పేరును సొంతం చేసుకుంది. చైనా శనివారం చాంగ్‌చున్ ఎయిర్ షోలో తొలిసారిగా తన J-35A స్టెల్త్ ఫైటర్ జెట్‌ను యాంటీ-రేడియేషన్ క్షిపణితో కలిపి ప్రదర్శించింది. దీనిని చైనా తన ఆధునిక ఫైటర్ జెట్‌లను వైమానిక పోరాటానికి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ మిషన్లకు కూడా సిద్ధం చేస్తోందనడానికి స్పష్టమైన…
Tayfun Block-4: పాకిస్తాన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న టర్కీ ఇప్పుడు తన మొదటి ‘‘హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్’’ని తయారు చేసింది. ‘‘టేఫన్ బ్లాక్’’ అనే క్షిపణిని ఇస్లాంబుల్‌లో జరిగిన అంతర్జాతీయ రక్షణ పరిశ్రమ ప్రదర్శన (IDEF) 2025లో ప్రదర్శించింది. ఈ కొత్త క్షిపణిని టర్కిష్ రక్షణ సంస్థ రోకెట్సన్ డెవలప్ చేసింది. ఇది టర్కీ దేశీయంగా తయారు చేసిన అత్యంత పొడవైన బాలిస్టిక్ మిస్సైల్ అయిన టేఫన్‌కు హైపర్సోనిక్ వెర్షన్.
యుద్ధం స్వరూపం మారిపోతోంది. సైనికులు, యుద్ధనౌకలు, యుద్ధ విమానాల స్థానాన్ని డ్రోన్లు ఆక్రమిస్తున్నాయి. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ శత్రువుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు దేశాలు అత్యధిక సంఖ్యలో డ్రోన్లను వినియోగించాయి. ఇజ్రాయిల్ పైన హమాస్ మెరుపు దాడి సమయంలోనూ డ్రోన్లే కీలకంగా వ్యవహరించాయి. ఇక, ఇజ్రాయిల్ పై పలుసార్లు డ్రోన్లతో విరుచుకుపడింది ఇరాన్. ఆపరేషన్ సింధూర్లోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. యుద్ధం స్వరూపం పూర్తిగా మారిపోయింది. మిసైళ్లు, యుద్ధ విమానాలు…