అసోం-మిజోరం మధ్య సరిహద్దు వివాదం మరింత ముదురుతోంది. ఇరు రాష్ట్రాలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇంచు భూమి వదులుకునేది లేదంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెబుతున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో కేంద్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘా పెట్టాయి. ఆరు కంపెనీలకు చెందిన సీఆర్‌పీఎఫ్ బలగాలు.. 306 జాతీయ రహదారిపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. సరిహద్దు ఘర్షణలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మిజోరం వెళ్లొద్దని.. తమ పౌరులకు…