తమిళనాడులో కిడ్నాపర్ అనే అనుమానంతో వలస కూలీపై దాడి చేశారు స్థానికులు. ఈ ఘటన తిరువళ్లూర్‌లోని పరికపటు గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వలస కూలీ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తూ రోడ్డుపై ఆడుకుంటున్న కొంతమంది పిల్లలతో మాట్లాడాడు. అయితే.. అతను కిడ్నాపర్ అనే అనుమానంతో గ్రామస్తులు అంతా కలిసి అతన్ని చుట్టు ముట్టారు. బాధితుడిని అక్కడ ఉన్న వారంతా చితకబాదారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
FIFA World Cup: ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఆదివారం అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ మేరకు స్టేడియాన్ని సిద్ధం చేస్తున్న ఒక వర్కర్ ఎత్తు నుంచి కింద పడి మరణించాడు. ఈ విషయాన్ని ఖతార్ అధికారులు వెల్లడించారు. లుసైల్ స్టేడియం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఖతార్‌లో జరుగుతున్న ప్రపంచకప్ పనుల…