Hyderabad Rain Alert: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజుల పాటు కురుస్తాయని ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష హెచ్చరిక జారీ చేసింది.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.