వాట్సాప్ సేవలు పునరుద్ధరించింది దాని మాతృ సంస్థ మెటా… సాంకేతిక లోపంతో మధ్యాహ్నం 12.29 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సాప్ సేవలు… మొదట ఇండియాలోనే దాని సేవలు నిలిచిపోయాయనే వార్తలు వచ్చినా.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు సోషల్ మీడియా ద్వారా బహిర్గతం అయ్యింది.. అయితే, దాదాపు 110 నిమిషాల తర్వాత తిరిగి వాట్సాప్ సేవలు ప్రారంభం అయ్యాయి.. సాంకేతిక సమస్య నెలకొంది… పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం… త్వరలోనే పునరుద్ధరిస్తామంటూ.. దాని మాతృసంస్థ మెటా…
సోషల్ మీడియాను షేక్ చేసే వాట్సాప్ ఒక్కసారిగా నిలిచిపోయింది… దేశవ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి వాట్సాప్ సేవలు ఆగిపోయాయి… యాప్ నుంచి సందేశాలు వెళ్లడంలేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు.. మెసేజ్ వెళ్లకపోవడం ఓ సమస్య అయితే.. కొన్ని మెసేజ్‌లు వెళ్లినా.. డబుల్ మార్క్.. డబుల్ బ్లూ టిక్ మార్క్ మాత్రం కనిపించడం లేదని.. అసలు మెసేజ్ అవతలి వ్యక్తికి వెళ్లిందా? లేదా అనే డైలమా నెలకొంది.. ఇది ఒక సాంకేతిక సమస్యగా తేల్చేశారు నిపుణులు..…