జర్మనీలో చాన్సలర్ మెర్కెల్ 16 ఏళ్ల పాలనకు చెక్ పడనుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. జర్మనీలో జరిగిన ఎన్నికల్లో మెర్కెల్ పార్టీకి 196 సీట్లు సాధించగా, ప్రతిపక్షంలో ఉన్న సోషల్ డెమోక్రాట్స్ పార్టీ 206 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, అనూహ్యంగా ఈ ఎన్నికల్లో గ్రీన్ పార్టీ 118 సీట్లు, ఫ్రీ డెమోక్రాట్ల పార్టీ 92 సీట్లు సాధించింది. ప్రధాన ప్రత్యర్థులైన క్రిస్టియన్ యూనియన్ పార్టీ, సోషల్ డెమోక్రాట్ల పార్టీలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు…