Mercy killing: పుట్టుకతోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఇద్దరు పిల్లలకు మరణాన్ని ప్రసాదించాలంటూ కేరళకు చెందిన ఓ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లల చికిత్సను కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కుటుంబీలకు చెప్పారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన కుటుంబంలోని ఐదుగురు ‘మెర్సి కిల్లింగ్’ కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
ఆ బాలుడిది ఆడుతూపాడుతూ గడిపే వయసు. అంగవైకల్యం ఆ ఎనిమిదేళ్ల బాలుడి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ బాలుడి బాధను చూసి ఆ కన్న హృదయం కన్నీరుమున్నీరైంది. ఆ బాలుడి కారుణ్య మరణం కోసం దరఖాస్తు చేసుకుందామని భార్యపై బాలుడి తండ్రి ఒత్తిడి తెచ్చాడు