Punjab and Haryana HC: భర్తని ‘‘హిజ్దా’’(నపుంసకుడు) అని పిలవడం మానసిక క్రూరత్వమే అని పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తికి అనుకూలంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను హైకోర్టు సమర్థించింది. ఈ ఏడాది జూలైలో ఫ్యామిలీ కోర్టు తన భర్తకు అనుకూలంగా విడాకులు మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఒక మహిళ వేసిన పిటిషన్‌ని జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ, జస్టిన్ సుధీర్ సింగ్‌లతో కూడిన డివిజనల్ బెంచ్ విచారించింది.