ఆంధ్రప్రదేశ్ యువ కేబినెట్ మినిస్టర్ మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం అందరికీ షాక్‌గా మారింది.. ఫిట్‌గా ఉండే గౌతమ్‌రెడ్డి.. చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.. ఇదే, సమయంలో.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి కూడా మరోసారి తెరపైకి వచ్చింది.. ఇద్దరిదీ చిన్న వయస్సే. ఇద్దరూ గుండెపోటతోనే సడెన్‌గా తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు.. ఇద్దరికీ అనేక పోలికలున్నాయి. పునీత్ రాజ్ కుమార్ వయస్సు 46 ఏళ్లు. గౌతమ్ రెడ్డి వయస్సు 50 ఏళ్లు. నిత్యం వ్యామాయాలతో ఫిట్ అండ్ హెల్దీగా వుండేవారు… ఇదే చర్చకు ప్రధాన కారణంగా మారింది.
Read Also: Chandrababu: జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్..!
ఇద్దరూ సడెన్ హార్ట్ అటాక్ తో హఠాన్మరణం చెందారు. ఇద్దరికీ మార్నింగ్ టైంలోనే హార్ట్ అటాక్ వచ్చింది. పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. కాఫీ తాగిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు మేకపాటి గౌతమ్ రెడ్డి. గుండెపోటు సమయంలో, రాజ్ కుమార్, గౌతమ్ రెడ్డిలకి ఒళ్లంతా చెమటలు పట్టాయి. హార్ట్ అటాక్ వచ్చిన 30 నిమిషాలకే రాజ్ కుమార్ చనిపోతే, హార్ట్ అటాక్ వచ్చిన కాసేపటికే మరణించారు గౌతమ్. అయితే, ఇద్దరికీ వ్యాయామం చెయ్యడమంటే ఇష్టం. పునీత్ ఎక్కడ షూటింగ్‌లకు వెళ్లినా, తన క్యారవాన్ లో జిమ్ వుండేదట. అలాగే గౌతంరెడ్డి సైతం తన అధికారిక నివాసాలన్నింటిలోనూ జిమ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. వరుస షూటింగ్‌లతో పునీత్ కు క్షణం తీరిక వుండేది కాదు. అటు పార్టీ పరంగా, ఇటు మంత్రిగా అధికారిక, రాజకీయ కార్యకలాపాలతో బిజిబిజీగా వుండేవారు గౌతమ్. అయితే, తన ఫేస్‌లో ఎప్పుడూ చిరునవ్వు చెదరనివ్వలేదు పునీత్. గౌతమ్ సైతం మార్నింగ్ నుంచి రాత్రి వరకు పర్యటనలు, సమీక్షలతో తీరికలేకుండా గడిపినా, ఒత్తిడి మాత్రం ఆయనలో కనిపించేదికాదు. అంతేకాదు, పునీత్‌కు, గౌతమ్‌కు, ఇద్దరికీ ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ అలవాట్లు లేవు.. అయినా.. ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం షాక్‌గా మారింది.